Telugu Sex Stories (71) : పడక మీదనుంచి లేచి కూర్చుని చుట్టూ చూసింది. చీకటి గోడకి దిగ్గొట్టిన మేకులా యెర్రటి బెడ్ లైట్ వెలుగుతోంది. రెండు చేతుల్నీ బాగా రాపాడించి కళ్ళను తుడుచుకుంది. ఆ కాస్త వేడిమికే నిద్ర కరిగిపోయినట్లు ఫ్రెష్ గా ఫీలయింది.
పక్కకు తిరిగి చూస్తే టైమ్ పీస్ అయిదు గంటలను చూపిస్తోంది. కిటికీలోంచి కనిపిస్తున్న బోగన్ విల్లా, పచ్చల రాయికి పగడాలను పొదిగినట్లుంది. దూరంగా వున్నా తురాయి చెట్టు పండక్కి పుట్టింటికి వచ్చిన పదిమంది ఆడపిల్లల కుటుంబంలా ఆకులన్నీ రాల్చేసి పూలనే మిగల్చుకుని కనిపిస్తోంది. గాలి అప్పుడే నదీస్నానం చేసివచ్చినట్లు చల్లగా తగులుతోంది.
“అబ్బ! ఎంత బావుందో వాతావరణం” తనలో తనే అనుకుంటూ పడకమీద నుంచి కిందకి దిగింది వర్ష.
బాత్రూమ్ లో ముఖం కడుక్కుని అద్దంలో చూసుకుంది. పాతికేళ్ళ పరువాన్ని ఆరోగ్యంతో రంగరించినట్లు మెరిసిపోతోంది శరీరం.
ఆమె పెద్ద అందగత్తేమీ కాదు. కానీ ఏదో తెలియని ఆకర్షణ చూపరులను ఇట్టే లాగేస్తుంది. వ్యక్తిత్వపు గుభాళింపువల్ల ఎక్స్ట్రా ఆకర్షణ అది. | Telugu Sex Stories (71)
సాధారణంగా చాలామంది ఆడపిల్లలకు దేనిమీదా ఒక దృక్పథం వుండదు. వాళ్ళు తల్లిదండ్రులకు కార్బన్ కాపీల్లా వుంటారు. అందుకే పోతపోసిన విగ్రహాల్లా కనిపిస్తారే తప్ప ప్రాణం వున్న మనుషుల్లా అనిపించరు. ఏ చిన్న సమస్య ఎదురైనా తల్లివైపో, తండ్రివైపో చూస్తుంటారు.
నీకు నాకు డాష్ డాష్… 7 | తెలుగు బూతు నవల >>>
పెళ్ళి అయ్యాక కూడా అంతే. మొగుడు ప్రతిరాత్రీ పడకటింట్లో వదలకుంటే, పుట్టింటికి పరుగెత్తి తనకేదో పెద్ద కష్టం వచ్చినట్లు నానా హైరానా చేస్తారు. ‘కొత్తలో అంతేననీ, ఆ వేడి కాస్త తగ్గాక నువ్వు రమ్మన్నా అతడు రాడ’న్న సత్యాన్ని తల్లో, యింకో ముసలావిడో చెప్పాల్సి వస్తుంది.
కానీ వర్ష అలా కాదు. ఆమెకు ప్రతి చిన్న విషయంపై కూడా ఒక అవగాహన వుంది. అదంతా ప్రపంచ పరిశీలనవల్ల, అధ్యయనం వల్ల వచ్చింది. తనకేదయినా సందేహంవస్తే ఎంతో కష్టపడి సమాధానం తెలుసుకునేది. అంతే తప్ప ముసుగుదన్ని పడుకునేది కాదు. | Telugu Sex Stories (71)
ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో వున్నప్పుడు ఓరోజు సాయంకాలం త్వరగా ఇంటికొచ్చింది. వంటింటిలో తండ్రి తల్లితో సరసాలాడుతున్నాడు. ఈ విషయం తెలియక వంటింటిలోకి అడుగుపెట్టిన ఆమెకు వాళ్ళ రొమాన్స్ కళ్ళపడింది. తండ్రి తప్పు చేసినవాడిలాగా కంగారుపడ్డాడు. తల్లి దోషిలాగా తలదించుకుంది. ఆమెకు పాపం ఏడుపు ఒకటే తక్కువ.
అప్పుడు వర్ష చాలా క్యాజువల్ గా తండ్రి దగ్గరికి వెళ్ళి “ఎందుకు నాన్నా! అలా తప్పు చేసిన వాడిలాగా నిలబడిపోయావ్? ఇదంతా క్వయిట్ నేచురల్. మీ శృంగారాన్ని చూసి నేనేదో అనుకుంటానని ఫీల్ కాకు- ఏమిటే అమ్మా! ఎందుకా ఏడుపూ…..? ఇప్పుడేమైందనీ? ఇలాంటి సీన్స్ చూసి నేనేదో వికారానికి లోనవుతానని నీ బెంగ కాబోలు. అంతటి బలహీనురాలిని కానులే” అని అక్కడి నుంచి వచ్చేసింది.
కూతుర్ని అలా గుడ్లప్పగించి చూస్తూండిపోయారు వాళ్ళిద్దరూ నిర్మొహమాటంగా వున్నది వున్నట్లు నిర్భయంగా చెప్పిన ఆమె తమ కూతురేనా అన్న సందేహం వాళ్ళిద్దర్నీ కాసేపటివరకూ బొమ్మల్లా నిలబెట్టేసింది. తమ కంటి ముందు పెరిగిన అమ్మాయి నిస్సంకోచంగా ఎలాంటి ;ఇన్హిబిషన్స్’ లేకుండా మాట్లాడడం అబ్బురంగా అనిపించింది.
తన కూతురు వయసుతోపాటు అభిప్రాయాలనూ మార్చుకుంటూ తనకంటే ఎత్తు ఎదగడం ఆమె తండ్రికి ఆశ్చరాన్ని కలుగజేసింది. ఎప్పుడో హనకు ఊహ తెలిసినప్పుడు ఏర్పరచుకున్న అభిప్రాయాలను ఆయన ఎప్పుడూ మార్చుకోలేదు. కానీ తన కూతురు ఎప్పటికప్పుడు కొత్త దృక్పథాన్ని అలవరచుకోవడం ఆయనకు మింగుడుపడలేదు. వయసొచ్చే కొద్దీ ఆమె వ్యక్తిత్వం కూడా పరిపూర్ణత సాధించుకుంది. | Telugu Sex Stories (71)
ఎం.ఏ. అయిపోయాక బి.ఇడి. చదవాలన్న కోరికను తండ్రితో చెప్పింది. “నాకోసం ఫిలాసఫీ చదువుకున్నాను నాన్నా! ఆ సబ్జెక్టులో మాస్టర్ డిగ్రీ నాకున్నా ఉద్యోగం రాదు. ఈ దేశంలో చదువు పరమార్థం రాజకీయనాయకులకి తెలియక పోవడం వల్ల ఆ సబ్జెక్టుకి ఎలాంటి విలువా లేదు. లేకుంటే ప్రతి ఒక్కరూ కంపల్సరీగా చదవాల్సిన సబ్జెక్టు అది. కానీ ప్రస్తుతం ఏ సబ్జెక్టులోనూ సీటు పంచలో తలదాచుకునే కాందిశీకుల గుడారంలాంటిదన్న మాట. దానివల్ల లెక్చరర్ పోస్టు కాదుకదా అటెండర్ ఉద్యోగం కూడా రాదు. అందుకే ఉద్యోగం కోసం బి.ఇడి. చదవాలనుకుంటున్నాను.”
ఇదంతా వంటింటిలో వుండి విన్న తల్లి పరుగులాంటి నడకతో అక్కడికి వచ్చి “మేం చెప్పినా వినకుండా ఇంతకాలం చదివావు. ఇక చదివింది చాలు. ఆ మూడుముళ్లూ వేసుకుని కాపురానికి వెళ్లు. అది నీకూ మంచిది మాకూ మంచిది” అంది.
💃 Telugu Boothu Kathalu, Telugu Sex Stories, Telugu Sex Novels.
“చూడే అమ్మా! నేను మీ మాటలు వినని తెలిసి ఎందుకు ప్రయాస పడతావ్? ‘ఈ లోకంలో పశుపక్ష్యాదులు సైతం తమ తిండి తామే సంపాదించుకుంటున్నాయి. ఒక్క స్త్రీ తప్ప’ అని ఎక్కడో చదివాను. అదిగో! ఆ క్షణమే నిర్ణయించుకున్నాను ఉద్యోగం చేయాలని.”
“మరి పెళ్ళి?”
“పెళ్ళి చేసుకోనని అనడం లేదు. అయితే పెళ్ళిచూపుల పేరిట మూడు నిముషాల తంతు ముగించి, ముహూర్తం నిర్ణయించేసి సిగ్గూ ఎగ్గూ లేకుండా ఫస్ట్ నైట్ కోసం ఎగబడటం నాకిష్టం లేదు. అలాంటి వ్యక్తి తారసపడప్పుడు పెళ్ళి చేసుకుంటాను.”
ఇదేమీ చోద్యమే. మా కాలంలో ఇలా ఏ ఆడపిల్లా బరితెగించి పెళ్ళి చేసుకోనని చెప్పేది కాదు” రాగాలు తీసింది తల్లి.
“మీ కాలంలో ఏ ఆడపిల్లా ఇలా మాట్లాడివుండదు. నిజమే. మీ కాలంలో టీ.వీ. వుందా? లేదు. మరి ఇప్పుడొచ్చింది. మీ కాలంలో లేదని నువ్వు టీ.వీ. కొనకుండా ఆపేశావా? లేదు. పైపెచ్చు కలర్ టీ.వీ. తెచ్చుకున్నావ్. అలానే అభిప్రాయాల్లోనూ మార్పులొస్తున్నాయి.
మీ అమ్మ పెళ్ళి అయిన ఆర్నెల్ల తరువాత బరువుగా కళ్ళమీద వాలిపోతున్న సిగ్గు తెరలను ఎత్తుకుని మొగుడ్ని మొదటిసారి బెడ్ రూమ్ లొ చూసింది. నువ్వేమో నెలకంతా భర్త కమనీయ రూపాన్ని కళ్ళారా తిలకించావ్. మరి మార్పు రాలేదూ? అలానే నేనూ. ఇక ఇందులో ఆర్గ్యుమెంట్స్ అనవసరం” చాలా స్పష్టంగా చెప్పింది ఆమె.
“అలా మాట్లాడకే- తప్పే” ఈసారి తల్లి అనునయంగా చెప్పింది.
💃 Telugu Boothu Kathalu, Telugu Sex Stories, Telugu Sex Novels.
“తప్పొప్పుల పట్టిక నా దగ్గర చదవకు. తప్పు ఒప్పు రెండూ కాలం మీద ఆధారపడి వుంటాయి. ఒక కాలంలో తప్పు మరో కాలంలో రైటు. మనిషికి సుఖం ఇచ్చేదంతా ఒప్పేనంటాడు రూసో అనే ఆయన. ‘నీ కర్తవ్యం నువ్వు నిర్వర్తించు, ఫలితం కోసం ఆశించకుండా’ అని అంటాడు శ్రీకృష్ణుడు భగవద్గీతలో. కాబట్టి నైతిక విలువలు కానీ మరే విలువలు కానీ కాల పరిస్థితులమీద ఆధారపడి ఉంటాయి. నా మటుకు నాకు సహజ వికాసానికి తోడ్పడేదంతా మంచే.”
ఇక కూతురితో ఎలా వాదించాలో తెలియక ఆమె తిరిగి వంటింట్లోకి వెళ్ళిపోయింది.
అంత గొడవయ్యాక, వర్ష బి.ఇడి. చదివి ఇటీవలే స్కూల్ టీచర్ గా చేరింది. లక్కిగా, ఉన్న వూరులోనే పోస్టింగ్ వచ్చింది.
ఇక ప్రస్తుతం
త్వరగా బయల్దేరి స్కూలుకు వెళ్ళాలన్న ఆలోచన రాగానే ఆమె ముఖంపై కాసిన్ని నీళ్ళు చల్లుకొని బ్రష్ చేసుకుని వంట గదిలోకి వచ్చింది.
కాఫీ తాగాక స్నానం చేసి తయారవటం మొదలుపెట్టింది.
‘యు’ షేప్ లో కత్తిరించుకున్న జుట్టును అలా వీపుమీద వదిలేసి మొదట్లో క్లిప్ పెట్టుకుంది. ముఖానికి ఆయిల్ ఆఫ్ ఒలేని కొద్దిగా పట్టించి లైట్ గా పౌడర్ అద్దుకుంది. నుదుటున పెద్దగా తిలకం బొట్టు పెట్టుకుంది.
ఆమె చీర కట్టుకోవడం పెద్దగా ఇష్టపడదు. చాలా ఇంపార్టెంట్ అయిన నడుమును అలా బహిర్గతం చేసే చీరకట్టుకు ఆమె వ్యతిరేకి. అందుకే మోడరన్ డ్రస్సులంటే ఇష్టం.
| Telugu Boothu Kathalu, Telugu Sex Novels.
ఆరోజు తెల్లని కాటన్ చుడీదార్ వేసుకుంది.
చివరిసారి అద్దంలో చూసుకుని బయల్దేరింది.
స్కూలుకు వెళ్ళేసరికి తొమ్మిదిన్నర దాటింది.
కారిడార్ లో నడుస్తుంటే వెంకటాచలం అనే టీచర్ ఎదురుపడ్డాడు.
అతనికి నోటి దురద ఎక్కువ. తోటి లేడీ టీచర్లతో వెకిలిగా మాట్లాడుతుంటాడు.
అయితే వర్ష దగ్గర మాత్రం అతను మంత్రగత్తె దగ్గర పడుకున్న కుక్కపిల్లలాగా నడుచుకుంటాడు. దానికి కారణం ఆమె గురించి విని వుండటమే.
ఆమె యూనివర్శిటీలో చదువుకునేటప్పుడు ఓరోజు క్లాసుకు వెళుతోంది. ఆర్ట్స్ బ్లాక్ ఆడిటోరియం వద్ద గుమిగూడిన విద్యార్థి బృందం ఆమెను చూడగానే కసెక్కింది.
ఓ విద్యార్థి ఆమెకు వినబడేటట్లు “చీర కుచ్చెళ్ళను తాకుతూ చేతిని పోనిస్తే ఏం తగులుతుంది?” అని ప్రక్కనున్న మిత్రుల్ని అడిగాడు.
ఈ ప్రశ్న వేసింది ఆమెకే కాబట్టి ఏం సమాధానం చెబుతుందా అని అందరూ అటువేపు చూస్తున్నారు.
సాధారణంగా అలాంటప్పుడు అమ్మాయిలు మరింత తల వంచుకుని నడక వేగం హెచ్చిస్తారు.
కానీ ఆమె ఠక్కున ఆగింది. మెల్లగా వాళ్ళ దగ్గరికి వచ్చి ఆ ప్రశ్న వేసిన విద్యార్థితో “ఇంటికెళ్ళి మీ చెల్లెలు చీరలోనో, మీ అక్క చీరలోనో చేయిపెట్టి చూడు. అక్కడ ఏం తగులుతుందో నాకూ అదే తగులుతుంది. ఎందుకంటే అనాటమీ ఎవరికైనా ఒక్కటే కదా” అంది.
పాపం కుర్రాళ్ళు బిక్కచచ్చిపోయారు. వంచిన తల ఎత్తలేదు. కళ్ళుమూసి తెరిచేంతలో తలో దిక్కు మాయమయ్యారు.
ఈ సంఘటన గురించి వినడంవల్ల వెంకటాచలం ఆమె ముందు బలవంతంగా నోరు కట్టేసుకున్నాడు.
అలాంటి వెంకటాచలం తనను చూసి అదోరకంగా నవ్వడం ఆమెకు ఆశ్చర్యాన్ని కలగజేసింది.
“ఏమిటీ విషయం?” అని అడిగింది అతను దగ్గరకు రాగానే.
“మిమ్మల్ని హెడ్ మాస్టర్ రమ్మంటున్నారు” అని చెప్పి ఆమెను దాటి వెళ్ళిపోయాడు.
వెర్రిమొర్రి ఆలోచనలు ఏమీ చేయకుండా హెడ్ మాస్టర్ గదిలోకి వెళ్ళింది.
ఏదో సీరియస్ గా రాసుకుంటున్న హెడ్ మాస్టర్ నారాయణరావు తల పైకెత్తి ఆమెను హూడగానే పలకరింపుగా నవ్వాడు.
“గుడ్ మార్నింగ్ సర్” ఎదురుగా కుర్చీలో కూర్చుంటూ విష్ చేసింది.
“నీకేమోగానీ నాకు మాత్రం బేడ్ మార్నింగమ్మా” అన్నాడాయన కళ్ళజోడును చేతుల్లోకి తీసుకుంటూ.
“అదేంటి సార్! ఏమైంది?”
“నీకు ట్రాన్స్ ఫర్ అయిందమ్మా. నీలాంటి సిన్సియర్ అండ్ బ్రిలియంట్ టీచర్ ను పోగొట్టుకుంటున్నందుకు చాలా బాధగా వుందమ్మా.”
ఆమెలో చిన్న కదలిక.
“ట్రాన్స్ ఫరా?”
“అవునమ్మా.”
అప్పటికి సర్దుకుంది ఆమె. ఉద్యోగం అన్న తర్వాత బదిలీలు తప్పవు కదా సార్! ఇంతకీ ఏ ఊరుకి ట్రాన్స్ ఫర్ చేశారు?”
| Telugu Boothu Kathalu, Telugu Sex Novels.