🐎 Telugu Sex Stories (142) : ఆమెకి కూడా తను నగ్నంగా ఉందన్న విషయం అప్పుడే స్పృహ లోకి వచ్చి, సిగ్గుపడి గబాలున దుప్పటిని తన మీదకి లాగేసుకుంది. లాక్కున్న తరువాత అనిపించింది, ఎంతో మంది దగ్గర నగ్నంగా పడుకున్న తనకు ఈ సిగ్గు అవసరమా అని. ఆమె అలా సిగ్గుపడడం గమనించనట్టుగానే, అతను వెనక్కి తిరిగి “ఓకే, నువ్వు డ్రెస్ చేంజ్ చేసుకో, నేను స్నానం చేసి వస్తా.” అని తన బట్టలు తీసుకొని బాత్ రూం లోకి దూరాడు. అతను తలుపు వేసుకోగానే, ఆమె చిన్నగా నవ్వుకొని గబగబా డ్రెస్ వేసుకుంది. పావు గంట తరువాత అతను స్నానం చేసి, నైట్ డ్రెస్ వేసుకొని బయటకి వచ్చాడు. మంచంపై మఠం వేసుకొని కూర్చుందామె. అతను ఆమెని చూసి నవ్వి “డిన్నర్ చేద్దామా?” అన్నాడు. ఆమె తల అడ్డంగా ఊపుతూ “చేసే మూడ్ లేదు. నువ్వు చేసి వచ్చేయ్.” అంది. “నీకు మూడ్ లేదు. నాకు ఆకలి లేదు. సో, డిన్నర్ కేన్సిల్.” అన్నాడు. “ఓకే, మరేం చేద్దాం?” అంది ఆమె. “ఇంకేం చేద్దాం! పడుకుందాం.” అన్నాడు. ఆమె నవ్వుతూ మంచం మీద వాలింది. అతను ఆమె పక్కన వాలాడు. ఒక్కటే బ్లాంకెట్, దానికి తోడు చలి. తప్పక ఇద్దరూ ఒక్కటే బ్లాంకెట్ కిందకి దూరారు. దూరంగా పడుకుంటే, ఆ బ్లాంకెట్ ఎవరికీ సరిపోవడం లేదు. దగ్గరగా అతుక్కొని పడుకోవాల్సి వచ్చింది. శరీరాలు అంత దగ్గరగా ఉండడంతో ఇద్దరికీ వెచ్చగా అనిపించింది. ఆమె కొద్ది సేపు వెల్లకిలా పడుకుంది. అతని స్పర్శ తగులుతుంటే ఆమెకి ఏదోలా ఉంది. అలా కొద్దిసేపు ఉండి, అతని వైపు ఒత్తిగిలి పడుకొని, అతని ఛాతీపై చేయి వేసింది. అతనికి ఆమె అలా చేయి వేయడం కాస్త ఇబ్బందిగా అనిపించినా, ఫరవాలేదులే అనుకున్నాడు.
మొగుడు పోయి ఫిగర్ ఏడుస్తుంటే ! లవర్ వచ్చి రాయి వేసాడట – 4 | Telugu Boothu Stories
ఆమె అతని గుండెపై చేతితో రాస్తూ “ఓక్క విషయం అడగనా?” అంది. “ఊఁ..” అన్నాడు. “నీకు ఆ పని అంటే ఎందుకు ఇష్టం లేదూ?” అంది. వెంటనే అతను “ఇష్టం లేకపోవడం కాదు. నా భార్య కన్నెతనంతో రావాలని నా ఆశ. అలాంటప్పుడు నేను కూడా అలానే ఉండాలి కదా.” అన్నాడు. ఆమె కొద్ది క్షణాలు మౌనంగా ఉండి, “కన్నెతనం అంటే మనసుకి సంబందించినదా! శరీరానికి సంబందించినదా!?” అని అడిగింది. అతనికి నిజంగానే ఆమె అన్నది అర్ధం కాలేదు. “ఏమిటీ రెండింటికీ తేడా?” అన్నాడు. “కొంతమంది ఆడపిల్లలు పెళ్ళి అయ్యేంతవరకూ ఎవరితోనూ సెక్స్ చేయరు. అసలు మగాళ్ళనే దగ్గరకి రానీయరు. కానీ ఊహల్లో మాత్రం ప్రభాస్ తోనో, మహేష్ తోనో కాపురం చేసేస్తుంటారు. వీళ్ళు శారీరక కన్యలు. కొంతమంది చాలామందితో పడుకుంటారు, నా లాగ. కానీ వాళ్ళ ఊహల్లో కనీసం ఒక్క మగాడితోనూ కాపురం చేయరు. వీళ్ళు మానసిక కన్యలు. నీకు ఏ రకమైన కన్య కావాలీ?” అంది ఆమె. అతను ఆమె చెప్పిన మాటలకు అవాక్కయ్యి అలానే ఉండిపోయాడు.
అవాక్కయిన రవిని చూస్తూ, “చెప్పు రవీ..” అంది ఆమె. “నువ్వు చెప్పింది నిజమే, నేనెప్పుడూ అలా ఆలోచించ లేదు.” అన్నాడతను. ఆమె నవ్వి “మరో ప్రశ్న అడుగుతా, ఏమీ అనుకోవుగా.” అంది. “అనుకోనులే చెప్పు.” అన్నాడు. “నువ్వు ఎప్పుడైనా హస్తప్రయోగం చేసుకొన్నావా?” అంది ఆమె. అతను మళ్ళీ షాక్ అయ్యి, “హేయ్, ఊరుకో..” అన్నాడు సిగ్గుపడుతూ. “చెప్పొచ్చుగా..” అంది ఆమె గోముగా. “ఊఁ…” అన్నాడతను అలాగే సిగ్గుపడుతూ. ఆమె పకపకా నవ్వి, “మ్…అప్పుడు ఎవరిని ఊహించుకుంటావ్?” అంది. “ఎవరో ఒక సినిమా ఏక్టర్ ని.” అన్నాడు. “ ఇప్పటివరకూ ఎంతమందిని ఊహల్లో చేసి ఉంటావ్?” అడిగింది ఆమె. 🐎 Telugu Sex Stories (142), Telugu Boothu Kathalu.
అతను కాస్త ఇబ్బందిగా చూస్తూ “టాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్…అందరూ కలిపి సుమారు ఒక వందమంది ఉంటారు.” అన్నాడు. ఆమె ఫక్కున నవ్వి, “సో, నా శారీరక వ్యభిచారం కంటే, నీ మానసిక వ్యభిచారమే ఎక్కువన్నమాట.” అంది. అతనికి నోట మాటరావడం లేదు. ఉష చెప్పిన దానిప్రకారం చూస్తే, ప్రపంచంలో ప్రతీ ఒక్కరూ ఏదోరకంగా వ్యభిచారులే అనిపించింది అతనికి. విచిత్రంగా అతనికి తెలియకుండానే అప్పటివరకూ వ్యభిచారంపై ఉన్న విముఖత తొలగిపోతుంది అతనికి. దానికి చిహ్నంగా, తన ఛాతీపై ఉన్న ఆమె చేతిపై, తన చేతిని వేసాడు. ఆమె కాస్త లేచి అతని గుండెలపై తల పెట్టుకుంది. అతని చేయి ఆమె భుజాల చుట్టూ బిగుసుకుంది. ఆమె చిన్నగా అతని ఛాతీపై ముద్దు పెట్టింది. బదులుగా అతను ఆమెని తనలోకి పొదువుకున్నాడు. ఆమె చిన్నగా నిట్టూర్చడంతో, ఆమె ఊపిరి అతని గుండెని కాల్చింది. బదులుగా అతను ఆమె తలపై ముద్దుపెట్టాడు. ఆమె తలఎత్తి అతని మొహంలోకి చూసింది. “నువ్వు శారీరక, మానసిక వ్యభిచారాల గురించి చెప్పావ్. నేను మరో విషయం గురించి అడగనా.” అన్నాడు. “ఊఁ…” అందామె. “వ్యభిచారం అంటే కాంక్షతో తప్పని తెలిసినా చేసేది. అది చేసినా, ఊహించుకున్నా వ్యభిచారమే. మరి మీరాభాయ్ కృష్ణుడితో చేసింది ఏమిటి?” అన్నాడు. ఆమెకి బుర్ర గిర్రున తిరిగింది. చప్పున అతన్ని వదిలి పక్కకి జరిగి కూర్చుంది.
అతనూ లేచి కూర్చొని, నవ్వి “నేను ఆమెలా ప్రాపంచిక చింతనలేని ప్రేమని కోరుకోవడం లేదులే, కంగారు పడకు. లోకంలో కేవలం వ్యభిచారులు మాత్రమే లేరు అని చెబుతున్నా. ఇకపోతే, ఇందాక నువ్వు అడిగిన ప్రశ్నకు జవాబు చెప్పనా.” అన్నాడు. “ఏ ప్రశ్న అది?” అంది ఆమె. “కొంతమంది ఆడపిల్లలు పెళ్ళి అయ్యేంతవరకూ ఎవరితోనూ సెక్స్ చేయరు. అసలు మగాళ్ళనే దగ్గరకి రానీయరు. కానీ ఊహల్లో మాత్రం ప్రభాస్ తోనో, మహేష్ తోనో కాపురం చేసేస్తుంటారు. వీళ్ళు శారీరక కన్యలు. కొంతమంది చాలామందితో పడుకుంటారు, నా లాగ. కానీ వాళ్ళ ఊహల్లో కనీసం ఒక్క మగాడితోనూ కాపురం చేయరు. వీళ్ళు మానసిక కన్యలు. నీకు ఏ రకమైన కన్య కావాలీ? అని అడిగావు కదా.” అన్నాడు. “ఊఁ..” అంది ఆమె. “నాకు నువ్వు కావాలి.” అన్నాడు. ఆమె జీవితంలో ఎప్పుడూ అంత షాక్ అవ్వలేదు. నిజానికి ఆమెకి ఆ ఆఫర్ కొత్తకాదు. చాలామంది విటులు కాస్త సుఖం పొందిన తరువాత రోటీన్ గా అదే అడుగుతారు, “నన్ను పెళ్ళి చేసుకుంటావా…లేదా…నాతో ఉండిపోతావా..” అని. కానీ అదంతా తాత్కాలిక ఉన్మాదంలో అడిగేవే. కానీ ఇతను ఒక స్థిర నిర్ణయంతో అడిగినట్టుగా ఉంది. అందుకే ఏం జవాబు చెప్పాలో అర్ధం గాక అలాగే ఉండిపోయింది.
(రెండవ కథ సశేషం.)
“మ్..కథంతా పూర్తిగా విన్నావుగా సోదరా!” అంది ఆమె రవితో. “అదేంటీ, పూర్తిగా చెప్పనే లేదుగా.” అన్నాడు రవి ఆశ్చర్యంగా. “ఇప్పుడు నేను అడిగే ప్రశ్నలకి నువ్వు ఏ జవాబు చెబుతావో, అదే ఈ కథకు ముగింపు.” అంది ఆమె. అతను అలాగే చూస్తున్నాడు ఆమెను. “అడగనా?” అంది ఆమె. “అడగండి.” అన్నాడతను.
“కథలో రవి ఆ నిర్ణయం ఎందుకు తీసుకున్నాడు? అతని నిర్ణయానికి ఉష ఏం జవాబు చెప్పాలి? జాగ్రత్తగా ఆలోచించి చెప్పు. ఈ సమాధానం లోనే నీ ఉష నీకు దొరుకుతుందో లేదో తెలుస్తుంది. కథలో ఉష చెప్పే జవాబు మరీ ముఖ్యం.” అంది ఆమె. అతను ఆలోచించసాగాడు. అతను ఆలోచనల్లో ఉండగానే, అతని తలపై ఎండ పడుతున్న ప్రదేశంలో నీడ వచ్చింది. అతను ఆ విషయాన్ని గమనించనంత ఆలోచనల్లో మునిగిపోయాడు.
అతను ఆత్రంగా ఏదో సమాధానం చెప్పబోయాడు గానీ, “ఈ సమాధానం లోనే నీ ఉష నీకు దొరుకుతుందో లేదో తెలుస్తుంది.” అన్న వాక్యం అతన్ని తొలిచేస్తుంది. ఒకవేళ తప్పు సమాధానం చెబితే ఉష తనకు దొరకదేమో! ఆ ఆలోచనకే అతను వణికిపోయాడు. “నాకు ఉష కావాలి. ఆమె హాయిగొలిపే చిరునవ్వు కావాలి. గిలిగింతలు పెట్టే ఆమె మోహనమైన కొనచూపు కావాలి. వేసవిలో మల్లెపూలలా మత్తుని జల్లే ఆమె మాటలు కావాలి. ఇంద్రధనుస్సులో మెరుపులని చమత్కారంగా ఇముడ్చుకున్న ఆమె మేనిమెరుపు కావాలి. శీతాకాలంలో వెచ్చదనాన్ని ఇచ్చే ఆమె సొగసులూ, వర్షాకాలంలో తడవనీయకుండా తనలోనే దాచుకొనే ఆమె నిండైన హృదయం కావాలి. నా ఉష నాకు కావాలి.”. అలా అనుకున్న తరవాత స్థిర నిశ్చయంతో ప్రశాంతంగా కూర్చొని ఆలోచించసాగాడు కథ లోని రవి, ఉషల గురించి.
రవికి ఉషలో కట్టిపడేసిన అంశాలు ఏమిటీ? కథను పూర్తిగా గుర్తు తెచ్చుకున్నాడు. ఉష గురించి మననం చేసుకున్నాడు. ఆమె ఒక వేశ్య. వచ్చిన అందరితో పోలిస్తే అందవిహీనంగా ఉంది. అందుకేగా అందరూ ఆమెని తిరస్కరిస్తే, రవి దగ్గరకు వచ్చిందీ. వాళ్ళు తిరస్కరించారే గానీ, ఆమె రవి దగ్గర చూపిన ప్రవర్తనలో ఎక్కడా ఆ న్యూనతా భావం(inferiority) కనబడలేదు. అసలు డబ్బులకోసం పడుకోడానికి వచ్చిందన్న భావనే లేదు ఆమెలో. తను చేస్తున్న పనిని చాలా సహజంగా, ఒక విశ్వాశం(conviction)తో చేసింది. అతనిపై చేయి వేసినప్పుడు గానీ, అతనితో మాట్లాడినప్పుడు గానీ, అతని పక్కన పడుకున్నప్పుడు గానీ…తను తప్పు చేస్తుందన్న భావనే ఆమెలో కనబడలేదు. తప్పు, ఒప్పు రెండూ మానసిక భావనలే కదా. ఆ భావనే లేనప్పుడు ఆమె తప్పు చేసినట్టు కాదు కదా. తప్పు చేయకపోతే అంతా స్వచ్చంగానే ఉంటుంది కదా. ఆ స్వచ్చతే కదా కన్నెతనం అంటే. ఆ కన్నెతనమే కదా రవికి కావలసింది. అతనికి కావలసింది దొరికినపుడు మరి ఎందుకు వదులుతాడు. అందుకే ఆమెతో “నాకు నువ్వు కావాలి.” అని అడిగాడు. 🐎 Telugu Sex Stories (142), Telugu Boothu Kathalu.