ఛా ఛా, పాపం ఇప్పటికే వాడు కుమిలి పోయి ఉంటాడు ఇంకా ఇలా దూరం చేస్తే మళ్ళీ ఇలాంటిది ఎదో చేసుకునే ప్రమాదం ఉంది.
ఇలా ఆలోచిస్తూ ఉన్న నన్ను ఎదురుగా మెడికల్ షాప్ అతను మేడం తీసుకోండి అని పిలిచాడు, వాడి చేతిలో ఉన్న టాబ్లెట్స్ తీసుకుని డబ్బులిచ్చి వచ్చేశా ?
వాడు చేసిన పనికి వాన్ని చంపేయకుండా వాడికే నేను టాబ్లెట్స్ తీసుకు వెళ్తుంటే నాకే నవ్వొచ్చింది. బిందు కు నేను ఇలా వాడికి సేవలు చేస్తున్నా అని తెలిస్తే నన్ను చంపేస్తుంది, దానికి తెలీకుండా ఉండడమే మంచిది అని అనుకుంటూ ఆటో కోసం నిలబడగా
అప్పుడే అటు వైపు వెళ్తూ నన్ను చూసి కార్ ఆపింది బిందు.
అమ్మో ఇది చూస్తే తిడుతుంది అని భరత్ గాడి కోసం తెచ్చిన టాబ్లెట్స్ కొంగు చాటున కప్పేసి బిందు ను చూసి పలకరింపు గా నవ్వా. తను ఎక్కు అంది
నేను టాబ్లెట్స్ దానికి కనిపించకుండా పట్టుకుని వొద్దులేవే సిద్దు వస్తా అన్నాడు అన్నా కానీ అది వినలేదు ఎక్కుతావా లేదా అంది
నేను అది వినదు అని తెలిసి కూడా మొండి వాదం చేయడం ఎందుకు లే అని కార్ ఎక్కా టాబ్లెట్స్ దాచిపెడుతూ
ఎక్కగానే కార్ పోనిచ్చింది, మధ్య మధ్యలో నా వైపు సీరియస్ గా చూస్తూ ఉంది, నేను కామ్ గా కూర్చుని ఉన్నా, తను నా వొంటిని గమనిస్తూ కొంచెం కోపం కూడిన స్వరం తోనే తగ్గాయా అంది భరత్ గాడు పెట్టిన గాట్లను ఉద్దేశించి. నేను పొడి పొడిగా హా తగ్గాయి అన్నా. కాసేపు నిశబ్దం
మళ్ళీ తనే అదే స్వరం తో ఇంకా మీ ఇంట్లోనే ఉన్నాడా అంది. నేను సైలెంట్ గా రోడ్ చూస్తున్నా, తను కొంచెం కోపంగా నిన్నే అడుగుతుంది అంది. నేను తన వంక చూసి మళ్ళీ ముఖం తిప్పేసుకుని రోడ్ వంక చూస్తూ ఉండిపోయా..
బిందు నన్ను కోపంగా చూస్తూ నీకు జన్మ లో బుద్ది రాదు అంటూ తల తిప్పి డ్రైవ్ చేయసాగింది.
తన కోపం లో అర్ధం ఉంది, భరత్ గాడు నాకంత చేసినా నేను వాన్ని ఇంకా మా ఇంట్లోనే ఉంచుకోవడం వాడికి సేవలు చేయడం వాడి కోసం బిందు తో గొడవ పడడం అవ్వన్నీ తన కోపానికి కారణం.
వాడిని ఇంట్లో పెట్టుకోవద్దు బయటకు పంపించేయి అని ఎన్ని సార్లు చెప్పినా పట్టించు కోలేదు, అదే దానికి మంట..
ఎంటి టాబ్లెట్స్ భరత్ గాడికా ? అని అనగానే కొంగు లో దాచుకున్న టాబ్లెట్స్ గురించి దీనికి ఎలా తెలిసిందా అని చూసా తను కోపంగా ముఖం తిప్పుకుంది. అంతలో మా ఇల్లు వచ్చేయడం తో కార్ ఆపింది. నేను చక చకా దిగేసి థాంక్స్ అని చెప్పే లోపే తను వెళ్లిపోయింది.
తన కోపం అలవాటు కావడం వల్ల పెద్దగా పట్టించు కాకుండా ఇంట్లోకి వచ్చేశా, గబగబా ఫ్రెష్ అయ్యి వాడికి జ్యూస్ తీసి టాబ్లెట్స్ తీసుకుని వాడి రూం లోకి అడుగుపెట్టా, ఎప్పటి లాగే వాడి ముఖం చూడకుండా టాబ్లెట్స్ జ్యూస్ వాడి పక్కన పెట్టేసి బయటకు వస్తుంటే వాడు కూడా ఎప్పటి లాగే ఏడుస్తూ నన్ను పిలిచాడు కానీ నేను పలక కుండా అక్కడ నుండి వచ్చేశా.
ఆక్సిడెంట్ జరిగి ఇప్పటికీ రెండు నెలలు అయ్యింది. మొత్తం బాగా అయినా కాలు ఒకటే బాగా దెబ్బ తగలడం వల్ల ఇంకా లేవాలేక పోతున్నాడు, పాపం రోజూ ఏడుస్తూనే ఉంటాడు ఎప్పుడు వెళ్ళినా బాధగా నన్నే చూస్తూ పిలుస్తాడు
కానీ నేనే పలకను, వాడంటే ఇష్టం లేక కాదు అలా అనుకునే ఉంటే వాన్ని ఇలా ఇంట్లో ఉంచుతానా ? సేవలు చేస్తూ ఉంటానా ?
ఏమో అంతే అలా జరుగుతూ ఉంది…
రెండు నెలలు అయ్యింది ఒక్క మాట కూడా మాట్లాడలేదు వాడితో చాలా సార్లు చెయ్యి పట్టుకుని ఏడుస్తూ మాట్లాడ్డానికి చూసాడు కానీ ఎలా మాట్లాడ తాను ?
రేపటికి అన్నీ రెడీ చేసావా ? అని ఆయన అనగానే ఆయన వైపు చూసి హా చేసానండీ మీవి సిద్దు గాడివి ఇద్దరివీ బట్టలు తీసి పెట్టా అని అన్నా. ఆయన సరే అంటూ నా దగ్గరకు వచ్చి బాగా చూసుకో ఈ నాలుగు రోజులు కాలేజ్ కు పోవొద్దు లే వాడిని ఇంట్లో ఉండి బాగా చూసుకో అని అనగా నేను సరేనండి అన్నా.
మరుసటి రోజు పొద్దున్నే తండ్రి కొడుకులు ఇద్దరు తిరుపతి కి బయలుదేరారు. ఆయన వెళ్తూ వెళ్తూ అల్లుడు జాగ్రత్త అని మరీ మరీ చెప్పాడు, ఎందుకో అల్లుడు అంటే ఈయనకు పంచ ప్రాణాలు చిత్రంగా అల్లుడు కు బాగు అయితే తిరుపతి కి వచ్చి గుండు కొట్టించు కుంటా అని మరీ వొట్టు వేసుకుని ఇప్పటికి వాడికి కాస్త బాగాయ్యే సరికి తిరుపతికి వెళ్తున్నాడు మొక్కు చెల్లించు కోవడానికి. అసలు ఎవడు వీడు ? ఆయన మరీ అంత మొక్కు పెట్టుకుని మరీ వీడికి బాగు కావాలని మొక్కుకోవడానికి ?
ఆయన ను అని ఏం లాభం లే ? నేనేం తక్కువా ?
వీడి కోసం ఎప్పుడూ బిందు తో గొడవ పడని నేను పడలేదా ? వీడు ఎన్ని చేసినా వీడిని ఇంట్లో పెట్టుకోలేదా ?
వీడికి మాకు ఏ పూర్వ జన్మ సంబంధం ఉందో ఏంటో ?
మామయ్యా మామయ్యా అని భరత్ గాడు పిలవగానే నేను వాడి రూం లోకి వెళ్లి చూసా ఎంటి అన్నట్లుగా, వాడు రెస్ట్ రూం కు వెళ్ళాలి అని తలొంచుకుని అన్నాడు నేను వాడి ముఖం చూడకుండా తల పక్కకు తిప్పి మీ మామయ్య సిద్దు తిరుపతికి వెళ్లారు ఈ నాలుగు రోజులు ఏమైనా కావాలంటే అడుగు అని వాడి వంక చుడకుండానే చెప్తూ వాడి దగ్గరకు వెళ్ళి వాడి చేతిని నా భుజం మీద వేయించు కుని తీసుకెళ్ళి మళ్ళీ తిరిగి తీసుకొచ్చా
వాడు మల్లీ ఏడుపు ముఖం పెట్టి నన్ను పిలుస్తూ విసిగిస్తాడు ఏమో అనుకున్నా, అదృష్ఠం అలాంటి పనులెం చేయలేదు.
ఇంకా ఏమైనా కావాలంటే పిలు అని గోడకు (ఇండైరక్ట్ గా వాడికి) చెప్పేసి బయటకు వస్తూ వాడి కాలు ను చూసా, చాలా మటుకు తగ్గిపోయింది ఇంకో రెండు మూడు వారాలు అంతే తిరిగి మళ్ళీ మామూలు స్థితికి వచ్చేస్తాడు.. (నన్ను మళ్ళీ వేదించడానికి.. హా హా..)
రాత్రి నిద్ర పోతూ ఆలోచించా..
అసలు ఎంత మార్పు వాడిలో మధ్యాహ్నం నా పైట జారినా అసలు చూడనే లేదు అని అనుకుంటూ ఉండగా మళ్ళీ అనిపించింది చూస్తే ఊరుకుంటానా ఉప్పు పాతరెయ్యనూ అందుకే చూడలేదు అని అనుకుంటూ గత రెండు నెలలు గా జరిగిన దాన్ని ఒకసారి నెమరు వేసుకున్నా..
వాడు బిందు ఇంటి నుండి బాధగా ఏడుస్తూ వెళ్ళడం, ఆ తరువాత ఆ భాధ లో సూసైడ్ చేసుకోవడం సమయానికి మేఘా అక్కడకు వచ్చి వాన్ని కాపాడడం, తరువాత వాన్ని గుర్తు పట్టి మాకు చెప్పడం, వాడి అమ్మా నాన్న లు రావడం, దాన్ని మేము ఆక్సిడెంట్ అని చెప్పడం, వాళ్ళ మా వెంట తీసుకు పోతాం అని అన్నా విడవకుండా వాన్ని మాతోనే పెట్టుకోవడం, ఇలా అన్నీ గుర్తు చేసుకుంటూ ఉండగా అమ్మా” అని భరత్ గాడి అరుపు వినిపించింది
వెంటనే పరిగెత్తు కుంటు వెళ్ళి చూస్తే బాత్రూమ్ కు అని లేచి నట్లు వున్నాడు నడవలేక పడిపోయాడు నేను వెంటనే వాన్ని లేపి నన్ను పిలవచ్చు గా అని పక్కకి చూస్తూ అంటూ వాన్ని పడుకో బెట్టా, వాడు నొప్పి తట్టుకోలేక పోతున్నాడు, కాలుకు కట్టు కట్టిన దగ్గర కూడా రక్తం వస్తూ ఉంది
దానికి కాటన్ అడ్డు పెడుతూ ఎం చేయాలో తెలీక వాడు విల విల లాడుతు ఉంటే తట్టుకోలేక డాక్టర్ కు ఫోన్ చేశా, ఫోన్ ఎత్తలేదు ఎందుకు ఎత్తుతారు అర్థ రాత్రి పన్నెండు నర అయ్యింది,
ఇప్పుడెలా అని అనుకుంటూ ఉంటే గుర్తు వచ్చింది బిందు
తనకు ముందే కోపంగా ఉంది నేను వాన్ని ఇంట్లో పెట్టుకున్నా అని ఇప్పుడు రమ్మని అడిగితే ఏమంటుందో అని అనుకుంటూనే ఇక చేసేది ఎం లేక వాడి బాధను చూడలేక ఫోన్ చేశా.
రింగ్ అవుతూ ఉంది. కానీ లిఫ్ట్ చేయలేదు మళ్ళీ చేశా ఈ సారి ఎత్తింది నిద్ర మబ్బులో హెలో ఎవరు అంది. బహుశా నిద్ర లో పేరు చూడలేదు ఏమో నేను అని అన్నా. బిందు వాయిస్ లో వెంటనే మార్పు వచ్చింది నేను అని తెలియగానే,
చెప్పు అంది కాస్త గరుకుగానే..
నేను ఎక్కువ మాట్లాడకుండా,
వాడు సడెన్ గా కింద పడిపోయాడు నొప్పి ఎక్కువై బాధ పడుతున్నాడు బ్లీడింగ్ కూడా అవుతుంది నాకేం చేయాలో తెలియట్లేదు అని అంటూ ఉండగా తను కోపంగా నాకెందుకు చెప్తున్నావ్ అంది. నేను ప్లీస్ అన్నా తను కాల్ కట్ చేసింది.
నేను తన వాట్స్ అప్ కు నా మీద ప్రేమ ఉంటే రా లేదంటే అవసరం లేదు అని మెసేజ్ పెట్టి ఫోన్ పక్కన పడేసి వాడి దగ్గరకు వెళ్ళి బ్లీడింగ్ కాకుండా కాటన్ పెట్టా మళ్ళీ..
వాడు పాపం నొప్పికి తట్టుకోలేక పోతున్నాడు, నాకేం చేయాలో పాలుపోవట్లేదు, బిందు వస్తుంది అన్న నమ్మకం నాకు లేకపోయినా వీడి బాధ చూసి రావాలి అని మనసులో గట్టిగా కోరుకుంటూ ఉన్నా. కాసేపటికి బయట ఎదో హార్న్ వినిపిస్తే బిందు వచ్చింది అని అర్దం చేసుకుని వెళ్ళి గేట్ తెరిచా
తను కార్ దిగి నా ముఖం చూడకుండా లోపలికి నడిచింది. నేను వాడి గది చూపించా, తను వాడిని చూసి ఎలా రియాక్ట్ అవుతుందో అని టెన్షన్ పడుతూ చూస్తున్నా, ఎందుకు అంటే బిందు వాన్ని చూడడం ఇదే మొదటిసారి ఆరోజు తరువాత…
బిందు ఎం వాడి ముఖం ఎం చూడకుండా గబ గబ ట్రీట్ చేసి కట్టు కట్టేసి బయటకు వచ్చింది. నేను థాంక్స్ అని చెప్పబోతుంటే కోపంగా నా వంక చూసి అక్కడ నుండి వెళ్లిపోయింది. .
నేను వాట్స్ అప్ లో థాంక్స్ అని పెట్టా తను చూసి రిప్లై ఇవ్వలేదు..