Skip to content

నీకు నాకు డాష్ డాష్… 9 | తెలుగు బూతు నవలలు

Telugu Sex Stories (74) : నాటకం ఖర్చూ, నా ఖర్చూ భరిస్తోంది ఆయనే. ఇంతవరకు బాగానే వుందిగానీ అక్కడ వచ్చింది పేచీ. కథరీత్యా గయుడు ఉమ్మిన ఉమ్ము కృష్ణుడి చేతుల్లో పడాలిగదా. కానీ దీనికి రవీంద్రరెడ్డి ఒప్పుకోవడం లేదు. ఎవడిదో ఉమ్మును నా దోసిళ్ళతో పట్టుకోవాలా? నా సర్పంచ్ గిరికే ఇది ఇన్సల్ట్. అంతగా కావాలంటే వాడి కిరీటం ఊడి నా చేతుల్లో పడేటట్టు కథ మార్చమని సర్పంచ్ పట్టుబట్టాడు. అయ్యా! మహానుభావా! అది నాటకం. మనం ఇష్టం వచ్చినట్లు మారిస్తే జనం చప్పట్లు కొట్టరు. చెప్పులతో కొడతారు అంటే వింటేనా? ఆయన్ను నాటకం నుంచి తప్పిద్దామంటే ఖర్చు పెట్టుకోగల మరో మనిషి లేడాయె. ఉంచుకుందామంటే లడాయి. చస్తున్నాననుకో ఎటూ తేల్చుకోలేక.”

వింటున్న వాళ్ళంతా నవ్వుతున్నారు.

ఆ వ్యక్తి డ్రామాలు నేర్పించే మాస్టారని అర్థమైంది ఆమెకు. పల్లెటూళ్ళలో ఇఅలామ్తి భేషజాలు, పట్టింపులు మామూలే. ఇన్ని వున్నా పట్టణాలకంటే పల్లెటూళ్ళే చాలా మెరుగని ఆమె నమ్మకం.

తమ వెనుక ఎవరో వస్తున్నట్లు కనిపించడంతో డ్రామా మాస్టారు వెనక్కి తిరిగాడు. చక్కగా, నాగరికంగా కనిపిస్తున్న వర్షను చూసి ఆగాడు.

“ఎవరమ్మా?” అంటూ పలకరించాడు.

“నా పేరు వర్ష. ఈ ఊరికి కొత్త టీచర్ని. ట్రాన్స్ ఫర్ మీద ఈ ఊరికి వచ్చాను.” | Telugu Sex Stories (74)

“అలానా” అని మరొకడివైపు తిరిగి “రేయ్ గంగయ్యా! ఆ సూట్కేసు అందుకోరా. పాపం ఆడకూతురు అంతంత బరువులు మోస్తోంది” అన్నాడు.

ఓ వ్యక్తి ఆమె చేతిలో వున్న సూట్కేసు అందుకున్నాడు.

తిరిగి అందరూ కదిలారు. ఆమె వాళ్ళ వెనకే మెల్లగా అడుగులేస్తోంది.

డ్రామా మాస్టారు మళ్ళీ తన నాటకాల ప్రపంచంలోకి వెళ్ళిపోయాడు.

నీకు నాకు డాష్ డాష్… 10 | తెలుగు బూతు నవల >>>

మొన్న దసరా ఉత్సవాలకు నెరబైలులో నాటకం వేశాము. సుభద్రా పరిణయం, నాటకం ఇంకొద్ది క్షణాల్లో ప్రారంభం అవుతుందనగా కృష్ణుడు, సుభద్ర పరార్. నాకు బీపీ రైజ్ అయిపోయింది. హార్మోనియం పెట్టెను అలా వదిలేసి లాంతర్లు తీసుకుని బయల్దేరాం వాళ్ళను వెదకటానికి. గుట్టలూ, పుట్టలూ అన్నీ తిరిగాం. ఎక్కడా కనిపించలేదు. ఆరుబయలు తిరుగుతున్నా చెమట్లతో తడిసి ముద్దయిపోయింది నా శరీరం. మరో అరగంటపాటు రాళ్ళల్లో, ముళ్ళల్లో తిరిగితే చివరికి ఓ బ్రిడ్జికింద దొరికారు. వాళ్ళను చూడగానే నిర్వాహకుడు కళ్ళనీళ్ళు పెట్టుకుని ఎక్కిళ్ళ మధ్య అడిగాడు ఎందుకిలా పారిపోయి వచ్చారని? వాళ్ళిద్దరూ భార్యాభర్తలు. దాంతో రాత్రయ్యేటప్పటికి బ్రిడ్జి కింద చేరిపోయారు.

“కృష్ణుడు వేషం వేసింది నెరబైలు వ్యక్తికాదా?” గుంపులోంచి ఓ వ్యక్తి అడిగాడు. | Telugu Sex Stories (74)

“కాదు. చివరి నిమిషంలో ఆయనకు టైఫాయిడ్ పట్టుకునేసరికి హీరోయిన్ గా చేసే అపర్ణకే మొదటి కృష్ణుడ్ని తెమ్మని టెలిగ్రామ్ ఇచ్చాను. ఇంకొకరు ఎందుకులెమ్మని ఆమె తన భర్తనే తెచ్చింది.”

“వాళ్ళిద్దర్నీ బ్రీడ్జి నుంచి పట్టుకొచ్చి నాటకం మొదలెట్టారా?”

“ఆఁ మేం వచ్చేటప్పటికే చుట్టూ వున్న డేరాలో సగాన్ని చించేశారు ఆడియన్స్. వాళ్ళ కోపాన్ని తగ్గించి నాటకం మొదలు పెట్టేసరికి తెల్లవారుఝామున మూడయింది.”

వింటున్న వారందరూ నవ్వారు. వర్ష కూడా పెదవి విడీవిడకుండా నవ్వింది.

నాగరికతకు దూరంగా విసిరేసినట్టుండే ఇలాంటి పల్లెట్టూళ్ళలో సెక్స్ ఒక్కటే రిక్రియేషన్. ఆ కబుర్లతోనే కాలక్షేపమని బోధపడింది ఆమెకు.

వాళ్ళు మాటల్లో వుండగానే ఊరొచ్చింది.

ఊరి పొలిమేరల్లో ప్రవేశిస్తుంటే అదో విధమైన ఉద్వేగం మొదలయింది ఆమెలో. ఆ క్షణం వరకు ఎలాంటి సంబంధంలేని ఆ గ్రామంలో సుమారు మూడేళ్ళపాటు పనిచేయ్యాల్సి రావడం విచిత్రంగానే అనిపించింది. జీవితమంటేనే మనం ఊహించని సంఘటనల సమ్మేళనం. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియకపోవడం జీవితంలో అత్యంత విషాదం. అదే సమయంలో వినోదం కూడా, జరిగే పరిణామాలను బట్టి అది ఆధారపడి వుంటుంది.

వీధి మొదట్లోకి రాగానే “అదిగోనమ్మా! సర్పంచ్ ఇల్లు. అక్కడికెళ్ళి ఆయనను కలుసుకోండి. మీకు అన్ని సదుపాయాలూ అమరుస్తాడు” అని చెప్పి డ్రామా మాష్టారు మరో వీధిలోకి దారి తీశాడు.

అలాగేనన్నట్టు తలవూపి ముందుకు సాగింది.

సర్పంచ్ ఇల్లు పెద్దదే. ఇంటిముందున్న వరండాయే టౌన్లో ఆమె ఇల్లంత వుంది. ఉదయపుటెండలో ఆ ఇల్లు దేవతల రాజు తలమీది కిరీటంలా వుంది.

ద్వారం దగ్గర నిలబడి “ఏమండీ!” అంటూ పిలిచింది.

కొంతసేపటికి ఓ అమ్మాయి ద్వారం దగ్గరికి వచ్చి “ఎవరూ!” అంటూ ప్రశ్నార్థకంగా చూసింది.

ఆమెకూ వర్ష వయసే వుంటుంది. ఇంకా పెళ్ళికాలేదు. అందంగా, అంతకంటే నాజూగ్గా వుంది. ఒంటిమీద కనిపించీ కనిపించకుండా వున్న పసుపుఛాయ. దేవతల వెనక కనిపించే వెలుగులా వుంది. | Telugu Sex Stories (74)

“నేను ఈ వూరికి కొత్తగా వచ్చిన టీచర్ని. పేరు వర్ష. సర్పంచ్ గారున్నారా?” అంటూ తనను తాను పరిచయం చేసుకుంది.

“టీచరా! లోపలికి రండి. నాన్నగారు వస్తారు” అని లోపలికి ఆహ్వానించింది ఆమె.

వర్ష లోనికి అడుగులు వేసింది.

ఇంటి దొడ్లో వున్న పొయ్యి దగ్గరకు తీసుకెళ్ళి అక్కడ ఓ స్టూలు వేసి కూర్చోమంది. వర్ష కూర్చున్నాక ఆమె వివరాలు అడిగి తెలుసుకుంది.

తన గురించి అంతా చెప్పాక “నా గురించి అన్నీ అడిగావు. మరి నీ గురించి చెప్పవేమిటి?” అని అడిగింది వర్ష. వాళ్ళిద్దరూ ఆ కొద్ది సమయంలోనే మంచి ఫ్రెండ్స్ అయిపోయి ఏకవచనంలోకి దిగారు.

“నా గురించి చెప్పుకోవడానికేముంది? నాపేరు ధాన్య. మాకు సిరి సంపదలన్నీ ధాన్యమే కాబట్టి నాన్న నాకా పేరు పెట్టారు. ఇంటర్ వరకు సిటీలో వుండే చదువుకున్నాను. ఆపైన చదివించడం నాన్నకు ఇష్టం లేకపోవడంతో ఇక్కడకు వచ్చేశాను. మా అమ్మ నా చిన్నప్పుడే పోయింది. ఇంత పెద్ద ఇంట్లో నేనూ నాన్న తప్ప ఎవరూ లేరు. ఆయనకు నేను తోడు, నాకు ఆయన తోడు.”

“నీ పేరు చాలా బావుంది.”

“థాంక్స్” ఆ పదాన్ని చాలారోజుల తరువాత ఉచ్ఛరించింది ధాన్య.

అంతలో సర్పంచ్ శివరామయ్య అక్కడికి వచ్చి కూతురితోపాటు మరో అమ్మాయిని చూసి, ఎవరన్నట్టు కళ్ళతో అడిగాడు.

ధాన్య వర్ష వివరాలు చెప్పి “ఈయనే మా నాన్న” అంటూ పరిచయం చేసింది. | Telugu Sex Novels

వర్ష రెండు చేతులూ ఎత్తి నమస్కరించింది.

“నువ్వు కొత్త టీచర్ వన్న మాట. ఇంతకు ముందున్న టీచర్ నెలరోజులు పనిచేసి ఈ మారుమూల గ్రామంలో వుండలేక ఉడాయించాడు. నువ్వు అలా చెయ్యవని నాకనిపిస్తోంది” అంటూ ఆయన అక్కడున్న సిమెంట్ చప్టా మీద కూర్చున్నాడు.

ఆయనకు ఏభై ఏళ్ళుంటాయి. ఎప్పుడూ తెల్లటి బట్టల్లో హుందాగా వుంటాడు. ఇరవై ఏళ్ళుగా ఆయనే ఆ వూరికి ఏకగ్రీవంగా సర్పంచ్.

“నాకు పల్లెటూర్లంటే ఇష్టం. కాబట్టి ప్రభుత్వం వాళ్ళు తిరిగి ట్రాన్స్ ఫర్ చేస్తే తప్ప వెళ్ళను.”

“అయితే ఇకనయినా మా ఊరి పిల్లలు నాలుగక్షరాలు నేర్చుకుంటారు. ఆడకూతురివి గనుక ప్రత్యేకంగా ఎక్కడుంటావ్? మా ఇంట్లోనే వుండు. మనుషుల్లేక ఈ ఇల్లు బోసిపోయి వుండడం గమనించావ్ కదా. కాబట్టి నువ్వు ఓగదిని వాడుకోవచ్చు. అంతే కాదు. భోజనం కూడా ఇక్కడే చేసెయ్. నువ్వుంటే మా అమ్మాయికీ కాలక్షేపం అవుతుంది.”

ఆమె మొహమాటపడతూ ఏదో చెప్పబోయింది. దీన్ని గమనించిన ధాన్య “ఇక నువ్వేమీ చెప్పకు. మా నాన్న మాట జవదాటినవారు ఇంతవరకూ ఈ గ్రామంలో లేరు. కొత్తగా ఆయనకు అప్రతిష్ట తేవద్దు” అంది నవ్వుతూ.

ఎక్కడో ఒంటరిగా వుండటం కన్నా అక్కడే వుండడం మంచిదనిపించింది వర్షకు. నెలకు ఎంతో కొంత ఇచ్చి పెయింగ్ గెస్ట్ లా వుందామని నిర్ణయించుకుంది.

“అలానే” అంది ధాన్యవైపు చూస్తూ.

ఆమె ముఖంలో ఆనందం చిమ్మింది, తనకు చక్కటి తోడు దొరికి నందుకు. | Telugu Sex Stories (74)

శివరామయ్య పైకి లేచి “నేనలా పొలాలవైపు వెళ్ళొస్తానమ్మా” అని ఒకడుగు ముందుకేసి ఏదో గుర్తొచ్చినట్టు ఆగి కూతురివైపు తిరిగి “ఏమంటున్నాడమ్మా గోపాలకృష్ణ? త్వరగా కరుణించమణి చెప్పు. ఎలానో ఓలా అతని దృష్టిని ఆకర్షించు. మూడేళ్ళయింది పొలాలు పండి. ఏం శని చుట్టుకుందో ఏమో? పుట్లు పుట్లు ధాన్యం పండాల్సింది పోయి గింజ రాలడం లేదు. మీరిద్దరూ ఒకటైతే తప్ప మనకు మంచికాలం రాదు” అని నిస్పృహతో వెళ్ళిపోయాడు ఆయన.

“వారు గోపాలకృష్ణ? మీకు కాబోయే భర్తా” అంటూ చిలిపిగా చూస్తూ అడిగింది వర్ష శివరామయ్య కనుమరుగు కాగానే.

ధాన్య పడీ పడీ నవ్వింది. కొంతసేపటికి బలవంతంగా నవ్వాపూకుని గోపాలకృష్ణ నాక్కాబోయే భర్త కాదు. ఈ గ్రామంలో మదనకామరాజు వంశానికి చెందిన పురుషుడు, ఆయనతో పౌర్ణమి రోజు గడిపితే” అంటూ ప్రారంభించి మొత్తం ఆచారం గురించి చెప్పింది.

వింటున్న వర్షకు మతిపోయింది. హెడ్ మాస్టర్ తన చేతికి ట్రాన్స్ పర్ ఆర్డర్స్ ఇస్తూ ఈ గ్రామం గురించి చెప్పిన మాటలు గుర్తొచ్చాయి.

ఆమె చాలాసేపటివరకూ ఆ షాక్ నుంచి తేరుకోలేకపోయింది

ఆ పౌర్ణమి రోజు పరమానందం ఇంట్లో ఉత్సాహం ఉరకలేస్తోంది. కారణం ఆయన పెద్దకోడలైన లహరికి గోపాలకృష్ణ దగ్గర్నుంచి పిలుపొచ్చింది.

రేపటినుంచి తమ ఇంటి రూపురేఖలే మారిపోతాయని అనుకుంటూ తనకు రానున్న సిరిసంపదల గురించి కలలు కనడంతోనే ఆ ఇంటిల్లిపాదికీ సరిపోతోంది. అందరూ ఏదో ట్రాన్స్ లో వున్నట్లు కనిపిస్తున్నారు.

“మన్మధ దేవుడా! మా మొర ఇంత కాలానికి ఆలకించి గోపాలకృష్ణ నుంచి కబురొచ్చేట్టు చేశావయ్యా” అని పరమానందం ప్రతి అయిదు నిముషాలకో మారు తూర్పుకొండకేసి చూస్తూ నమస్కారాలు పెడుతున్నాడు.
| Telugu Boothu Kathalu, Telugu Sex Novels.