Skip to content

నీకు నాకు డాష్ డాష్… 15 | తెలుగు బూతు నవల

Telugu Sex Stories (80) : అమ్మ ఈసారి మరింత అనునయిస్తూ “అలా అనకు. ఇంత చిన్న కారణం వలల్ నీ జీవితాన్ని మరొకరితో ముడిపెట్టుకుని బాధలు పడవద్దు. మేము నీ తల్లిదండ్రులం గానీ శత్రువులం కాము. వాడికి ఏమైనా దురలవాట్లు వున్నాయా అంటే అదీ లేదు. సిగరెట్ తాగడు. మందు పుచ్చుకోడు. ఆడవాళ్ళ వెంట పడడు. అడపా దడపా ఆ లాటరీ టికెట్లు కొనడం తప్ప మరో యావలేదు” అని మావయ్య సుగుణాలను ఏకరుపు పెట్టింది.
అమ్మ చెప్పిన సుగుణాలన్నీ ఏమోగానీ నాకు మాత్రం చలపతిలో కనిపించిన సుగుణం ఒక్కటే. ప్రశాంతతను కోరుకునే మనస్తత్వం. చాలా నెమ్మదస్తుడు. ఎప్పుడూ బిగ్గరగా మాట్లాడి కూడా ఎరుగడు. కామ్ గా వుండేవాడు. ఇంట్లో కూడా ప్రశాంతత కొరుకునేవాడు. ఇల్లు ఎప్పుడూ మౌనంగా ఋషిలా వుండాలనేవాడు. మా అమ్మ ఎప్పుడైనా ఎవరిమీదైనా కేకలేస్తుంటే వెంటనే అడ్డుకునేవాడు. మనం నష్టపోయినా సరే ప్రశాంతంగా వుండే పరిస్థితిని ఏర్పాటు చేసుకోవాలనేవాడు.
ఈ ఒక్క సుగుణానికి కట్టుబడి అతన్ని పెళ్ళి చేసుకోవడం అసంభవం. అదే మాట చెప్పి కిందకి వచ్చేశాను.
మరుసటిరోజు నాన్న నాకు క్లాసు తీసుకున్నాడు. మావయ్యను చేసుకొమ్మని బ్రతిమిలాడాడు. బుజ్జగించాడు. చివరి అస్త్రం అన్నట్లు ఈ పెళ్ళికి ఒప్పుకోకపోతే ఏ నుయ్యో గొయ్యో చూసుకుంటానని బెదిరించాడు.
ఇంట్లో అమ్మా నాన్నే ఇలా శత్రువులుగా మారిపోతే ఆడపిల్లను నేనేం చెయ్యగలను? చివరికి విధిలేని పరిస్థితుల్లో తల వూపాను. | Telugu Sex Stories (80)
పెళ్ళి అంటే కలగాల్సిన థ్రిల్ లేదు. నా ఊహలకు, నా రంగుల కలలకు అంత్యక్రియల్లా అనిపించింది. మావయ్యతో నా పెళ్ళి నిశ్చయమయ్యాక ఊర్లోణి నాతోటి ఆడపిల్లలు నా వైపు జాలిగా చూస్తున్నట్లు అనిపించి, బాధ పొంగి పోర్లేది.
పెళ్ళి పనులు మొదలయ్యాయి మా ఇంట్లో.
కాంచీపురం వెళ్ళి చీరలు తెచ్చారు. తిరుపతికి వెళ్ళి బంగారు నగలు తెచ్చారు. పెళ్ళికూతురి అలంకరణకోసం అన్ని కాస్మిటిక్స్ మద్రాసు నుంచి తెప్పించారు.

పచ్చని పూకులు తోడుంటే… దెంగే మడ్డ వెంటుంటే – 35 | Telugu Rathi Novels

ఇవి ఏవీ నాకు ఆనందాన్ని కలిగించలేదు. నా యవ్వన సామ్రాజ్యానికి కాపలకాసే ఇంద్రచాపంలా వుండాల్సిన పట్టుచీర ఉత్తిబట్టలా అనిపించింది. నా శరీరపు రంగును చూసి తలలు వేలాడదీసినట్లు అనిపించాల్సిన బంగారు ఆభరణాలు ఉత్తిలోహపు పిచ్చి డిజైన్లలా కనిపించాయి. నా ఆనందానికి మెరుగులు దిద్దడానికి పుట్టినట్లు అనిపించాల్సిన కాస్మిటిక్స్ ఉత్తి రసాయన జిగురుల్లా తోచాయి.
నాకేమీ థ్రిల్స్ అనిపించకనే నా పెళ్ళి అయిపోయింది.
నా ఫస్ట్ నైట్ ఎలా రసహీనంగా తెల్లవారిందో మిగిలిన రోజులూ అలానే అనిపించాయి. మధ్య వయసులో ఎలాంటి స్పందన వుంటుందో అంతే ప్రదర్శించేవాడు నా భర్త. నా అభిరుచులకు, ఆయన మనస్తత్వానికీ ఎక్కడా పొంతనలేదు.
ఒ రెండేళ్ళు గడిచిపోయాయి అమ్మ టైఫాయిడ్ తోనూ, నాన్న క్షయతోనూ చనిపోయారు. నాకు పిల్లలు కూడా కలగాలేదు. దీంతో మళ్ళీ నేను ఒంటరిదాన్నయి పోయాను. నాకు పెళ్ళి అయిందన్న విషయం కూడా అప్పుడప్పుడూ గుర్తుండేది కాదు. | Telugu Sex Stories (80)
నా ప్రవర్తనలో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. బాగా గయ్యాళితనం వచ్చింది. కానిదానికీ, అయినదానికీ పనివాళ్ళమీద విరుచుకుపడే దాన్ని. బయట మనుష్యులతో కూడా అలానే ప్రవర్తించేదాన్ని. చిన్న విషయానికి కూడా కటువుగా రియాక్టయ్యేదాన్ని. నానా తిట్లూ అబ్బాయి. బూతులు కూడా అలవాటయ్యాయి. జనాన్ని చూస్తేనే శివాలెత్తి పోయేదాన్ని. మనుష్యులంతా అసహ్యంగా కనిపించేవాళ్ళు. ఇరుగు పోరుగంటే నన్ను పీక్కుతినడానికి తిష్టవేసిన వాళ్ళలా అనిపించేవాళ్ళు.
కొన్నిరోజులకి ఊరు ఊరంతా నేనంటే హడలిపోయే స్థితికి వచ్చింది. నాలాంటి గయ్యాళి, కచ్చబోతు మనిషి, వ్యవహారాల పుండాకోరు. చాడీల మనిషి మరొకరు ప్రపంచంలో వుండదన్న పేరొచ్చింది.
బయటే కాదు. ఇంట్లోనూ అంతే. పనిమనుషులమీద ఎగిరేదాన్ని. ఎంత చిన్న విషయానికయినా నా భర్త మీద విసుక్కునేదాన్ని, కోపగించుకునేదాన్ని, ప్రతిదానికీ పేచీకి దిగేదాన్ని.
నా భర్త నరకం ఎలా వుంటుందో నా ప్రవర్తనలో రుచి చూపించాను. ఆయన కొరుకునే ప్రశాంతత పూర్తిగా కరువైంది. రోజులో ఒక నిముషం కూడా ఆయనకు ప్రశాంతత చిక్కుకుండా చేసేదాన్ని.
ఈ గుణాలన్నీ ఎలా అబ్బాయో నాకు తెలియదు. నాభర్త ప్రశాంతతను ఇష్టపడుతున్నాడు కాబట్టి, ఆయనమీద పగ సాధించాలన్న కోరికతో నేనలా అయిపోయానో ఏమో తెలియదు. | Telugu Boothu Kathalu, Telugu Sex Novels.
అందర్లాగే నేనెప్పుడూ నన్ను నేను విశ్లేషించుకోలేదు. నాకు ఏం కావాలో, ఏం తక్కువైందో నా అంతరంగాన్ని వెదికి తెలుసుకోలేదు. గయ్యాళిగా వుండడంతో ఇతరులమీద చాడీలు చెప్పడంలో, అసహ్యంగా మాట్లాడడంలో, ఎదుటివాళ్ళు నైతికంగా ఎలా పతనమైపోతున్నారో చెప్పుకోవడంలో వుండే ఆనందాన్ని అనుభవిస్తున్నాను.
ఇల్లు ఇలా అయిపోవడాన్ని భరించలేకపోయాడు నా భర్త. అందుకే రాత్రయితే పండరి భజనకు వెళ్ళిపోయేవాడు. త్వరలోనే ఆయన పండరి భజనలు నేర్పించే గురువు స్థాయికి ఎదిగిపోయాడు. రోజు రాత్రికాగానే దేవాలయం దగ్గరికి వెళ్ళేవాడు. కుర్రుకారుకి పండరి భజనలు నేర్పించి ఏ అర్థరాత్రో ఇంటికి చేరుకునేవాడు.
ఇదిగో ఇలాంటి సమయంలో మా వూరికి వంశీ వచ్చాడు
అతనిది మావారే. చిన్నప్పుడే వాళ్ళ అమ్మమ్మ ఊరెళ్ళిపోయాడు. అక్కడే డిగ్రీ వరకు చదువుకున్నాడు. అప్పుడప్పుడూ వచ్చి వెళ్ళేవాడు. ఊరికి వచ్చినప్పుడు ఏ రెండు మూడు రోజులో వండడం వల్ల నేనెప్పుడూ అతన్ని పరిశీలించలేదు.ఈమధ్య అతని తాతయ్య పోయాడు. దాంతో అక్కడున్న పొలమూ, పుట్రా అమ్ముకుని అతని అమ్మమ్మ కూతురి దగ్గరికి వచ్చేసింది. అమ్మమ్మతోపాటు అతనూ పర్మినెంట్ గా ఊరికి వచ్చేశాడు.
అతను వచ్చిన రెండోరోజో, మూడోరోజో వీధిలో వెళుతుంటే చూశాను. బంధువుల అబ్బాయి కనుక పలకరించాను.
“ఏం వంశీ! ఎప్పుడు రాక?”
“మొన్న వచ్చాను. అంతా బావున్నారా?” అంటూ నేనున్న వరండాలోకి వచ్చాడు.
“ఆఁ”
“మామయ్య ఎక్కడ?”
“పండరి భజనలు కదా. ఆ ఏర్పాట్లు చూడడానికి వెళ్ళాడు.”
వంశీ వెళ్ళిపోయాడు. | Telugu Sex Stories (80)
రెండోరోజు ఇంకాస్త పొద్దుపోయాక వచ్చాడు. వరండాలో వున్న మంచంమీద కూర్చుని అవీ ఇవీ కబుర్లు ప్రారంభించాడు.
నా నేచర్ తెలిసి ఎవరూ మా ఇంటికి వచ్చేవాళ్ళు కారు. ఇప్పుడు ఇలా మాట్లాడడానికి మనిషి దొరకడం చాలా రిలీఫ్ గా వుంది. అందుకే అతను చిన్న ప్రశ్న వేసినా సుదీర్ఘమైన జవాబులు చెబుతున్నాను.
ఆ తర్వాత రోజూ రాత్రి ఏడుగంటల ప్రాంతాన మా ఇంటికి వచ్చేవాడు. ఆ టైమ్ కి నా భర్త పండరి భజన నేర్పించడానికి దేవాలయం దగ్గరికి వెళ్ళేవాడు. నేనూ, వంశీ ఆరుబయట కుర్చీలో కూర్చుని కబుర్లు వేసుకునేవాళ్ళం. ఏ తొమ్మిందింటికో అతను ఇంటికి వెళ్ళేవాడు.
క్రమంగా నాలో మార్పు రావడం ప్రారంభించింది. మనుషుల మీద ఇంతకు ముందున్న ద్వేషం లేదు. గయ్యాళితనం కాస్తంత తగ్గింది. పనివాళ్ళ మీద కేకలు వేయడం ఎప్పుడో తప్ప చేయడం లేదు. చాడీలు కూడా తగ్గాయి.
మనసులో అంతకు ముందున్నంత గందరగోళం లేదు. ఫ్రస్ట్రేషన్ తో పిచ్చిపట్టినదానిలా ప్రవర్తించే నేను మామూలు మనిషి అయ్యాను. ఇంతకు ముందులా వెర్రిమొర్రి కలలు కూడా రావటం లేదు.
అయితే ఎందుకు నాలో ఇలా మార్పు వచ్చిందో మాత్రం గుర్తించలేదు. నాలోకి నేను తొంగిచూసుకోవడమంటే నాకెప్పుడూ భయమే. | Telugu Sex Stories (80)